లయన్స్‌ సేవలు వెలకట్టలేనివి

25 Jul, 2016 22:52 IST|Sakshi
లయన్స్‌ సేవలు వెలకట్టలేనివి
పిట్లం :  లయన్స్‌ క్లబ్‌ చేస్తున్న సేవలు ప్రశంసనీయంగా, మరువలేనివిగా ఉన్నాయని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధేlఅన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం రాత్రి మండల కేంద్రంలోని సాయి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన 11వ ఇన్‌స్టాలేషన్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వళన చేపట్టి అనంతరం మాట్లాడారు. లయన్స్‌ క్లబ్‌ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని, అనాథ పిల్లల కోసం పిట్లంలో ఏర్పాటు చేసిన అనాథ శరణాలయం ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు హరితహారం కార్యక్రమం చేపట్టడం, పేద పిల్లలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లాంటిSకార్యక్రమాలు చేపడుతుండడం అభినంధనీయమన్నారు. కొత్తగా ఏర్పాౖటెన కమిటీ సభ్యులకు అభినంధనలు తెలిపారు. సమాజ సేవలో మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవాలని సూచించారు. 
కొత్త అధ్యక్షుల ప్రమాణ స్వీకారం
పిట్లం లయన్స్‌ క్లబ్‌ కొత్త అధ్యక్షునిగా కంబాపూర్‌ గ్రామానికి చెందిన సంగప్ప శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యదర్శిగా బాలయ్య, ట్రెజరర్‌గా శ్రీనివాస్‌లు బాధ్యతలు చేపట్టారు. నారాయణఖేడ్‌ క్లబ్‌ అధ్యక్షునిగా డాక్టర్‌ శివకుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్‌ మల్టిబుల్‌ కౌన్సిల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ బాబురావ్‌ మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ సభ్యులు సమాజంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు పిట్లం క్లబ్‌కు రూ. 25 వేల రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ సభ్యులు సంజీవ్‌ రెడ్డి, వేణుగోపాల్, రాజ్‌ కుమార్, లక్ష్మీ నారాయణ, చంద్రశేఖర్, సుధాకర్, రమణాగౌడ్, గ్రామ సర్పంచ్‌ హన్మ గంగారాం, జెడ్పీటీసీ ప్రతాప్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ నర్సాగౌడ్, కో ఆప్‌్షన్‌ శేక్‌ కరీం, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు