మద్యం వ్యాపారుల మీమాంస

1 Apr, 2017 23:30 IST|Sakshi
జంగారెడ్డిగూడెం : లాటరీలో మద్యం దుకాణాలు దక్కినా ఎక్కడ ఏర్పాటు చేయాలనే సందిగ్ధంలో వ్యాపారులు ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర, జాతీయ ప్రధాన రహదారులకు 500 మీటర్లకు పైబడి మద్యం దుకాణాలు ఏర్పాటుచేయాల్సి ఉంది. అలాగే మద్యం దుకాణాలను సూచి స్తూ బోర్డులు పెట్టకూడదు. ఈ నేపథ్యంలో దుకాణాలు ఎక్కడ పెట్టాలో తెలియక మద్యం వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో దుకాణాలు రాష్ట్ర, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్నాయి. కొత్త నిబంధనలతో జనావాసాల మధ్య లేదా ఒకే ప్రాంతంలో నాలుగైదు దుకాణాలు పెట్టాల్సి ఉంది. ఇది వ్యాపారులకు మింగుడు పడటం లే దు. జనావాసాల మధ్య పెట్టాల్సి వస్తే గుడి, బడికి దూరంగా ఉండాలి. ఆ ప్రాంతంలో మహిళల నుంచి ప్రతిఘటన ఎదురుకాకుండా చూసుకోవాలి. 
 
ఒకే ప్రాంతంలో నాలుగైదు దుకాణాలు 
గతంలో ప్రాంతాల వారీగా షాపులను కేటాయించి లాటరీ నిర్వహించేవారు. అయితే మారిన నిబంధనల నేపథ్యం లో ఓ పట్టణంలో సుమారు 10 దుకా ణాలు ఉంటే వారు పట్టణ పరిధిలో ఎక్కడైనా నిబంధనలు ధిక్కరించకుం డా ఏర్పాటుచేసుకోవచ్చు. దీంతో ఒకే ప్రాంతంలో నాలుగైదు షాపులు పోటీ పడీ మరీ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఏ ప్రాంతంలో వ్యాపారం అధికంగా ఉంటుందో అక్కడ ఎక్కువ దుకాణాలు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. దీంతో ఉన్న వ్యాపారం తగ్గుతుందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఈ నిబంధనలతో గతంలో మద్యం దుకాణాలు నిర్వహించే వారికి  తలబొప్పి కడుతుంటే కొత్త వారికి దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నాయి. అత్యుత్సాహంతో టెండర్లు వేసి మద్యం షాపులు లాటరీలో తగిలినా ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. లాటరీ లో తగిలినా అమ్మేసుకుందామంటే నిబంధనలు కఠినంగా ఉండటంతో మద్యం సిండికేట్‌లు సైతం కొనుగోలు కు ముందుకు రావడం లేదు. 
 
విధిగా ఎమ్మార్పీకే..
లైసెన్స్‌ ఫీజులు గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం అదే క్రమంలో మార్జిన్‌ను 8 శాతానికి పరిమితం చేసిం ది. విధిగా ఎమ్మార్పీకే విక్రయించాలనే నిబంధన విధించింది. దీనిని అత్రికవిు స్తే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అపరాధ రుసుం విధించే అవకాశం ఉంది. ఇక మామూళ్ల సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారం లాభించేనా అని వ్యాపారులంతా సందిగ్ధంలో ఉన్నారు. 
ఉదాహరణకు..
ఉదాహరణకు జంగారెడ్డిగూడెం పట్ట ణాన్ని తీసుకుంటే ఏలూరు రోడ్డు నుంచి బుట్టాయగూడెం బైపాస్‌ రోడ్డు వరకు, కాకర్ల జంక్షన్‌ నుంచి బైపాస్‌ వరకు, పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి వారపు సంత వరకు, రాష్ట్ర రహదారి (బైపాస్‌)లో షాపులు పెట్టేందుకు అవకాశం లేదు. వాస్తవానికి ఈ ప్రాంతంలోనే సుమారు 5 దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. పట్టణంలో ఏడు షాపులకు అనుమతి ఉంది. దీని ప్రకారం చూస్తే ఒక కొవ్వూరు రోడ్డు, అశ్వారావుపేట రోడ్డు మినహా ఏ ప్రాంతంలోనూ షాపులు పెట్టుకునే అవకాశం లేదు. దీంతో షాపులన్నీ ఈ రెండు రోడ్డుల్లోనే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. జనా వాసాల మధ్య పెడదామన్నా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
 
మరిన్ని వార్తలు