ఈ నెల 28న మద్యం లైసెన్సులు జారీ

12 Sep, 2015 22:02 IST|Sakshi

హైదరాబాద్: నూతన మద్యం విధానంలో భాగంగా 2015 - 17 సంవత్సరాల కోసం ఏర్పాటు చేసుకునే మద్యం దుకాణాలకు(ఎ-4 షాపులకు) ఈనెల 28న లెసైన్సులు జారీ చేయనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసే దుకాణాలకు సంబంధించి ఈనెల 14న జిల్లా గెజిట్‌లో నోటిఫికేషన్ జారీ చేస్తారని, 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు.

 

ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మద్యం దుకాణాల కేటాయింపు డ్రా ఉంటుందని తెలిపారు. డ్రాలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వాళ్లకు 26వ తేదీన ప్రొవిసనల్ లెసైన్సులు ఇచ్చి 28న పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేయనున్నట్లు చంద్రవదన్ తెలిపారు.

 

 

 

 

మరిన్ని వార్తలు