రూ.667 కోట్లు తాగేశారు!

12 May, 2016 16:24 IST|Sakshi

నిజామాబాద్ : మందు బాబులు ఈ ఏడాది తెగ తాగేశారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2016 ఏప్రిల్ వరకు వీరు తాగేసిన మందు విలువ ఎంతో తెలుసా..? అక్షరాల రూ. 667 కోట్ల 46 లక్షల 19వేల 120 రూపాయలు. మే నెల చివరి వరకు మరో రూ. 60 కోట్ల మద్యం విక్రయాలు జరుగవచ్చని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. నిజామా బాద్ జిల్లాలోని మొత్తం 147 మద్యం దుకాణాలు, బార్‌లలో ఒక్క ఏడాదిలో ఈ స్థాయిలో మద్యం విక్రయించడం రికార్డు అని ఐఎంఎల్ డిపో అధికారులు పేర్కొంటున్నారు. మద్యం విక్రయాలు ఈ స్థాయిలో జరగడానికి గుడుంబా, కల్తీ కల్లు పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఒక్క ఏడాదిలోనే రూ.194 కోట్ల 81 లక్షల 41వేల 90 రూపాయల విలువైన బీర్‌లు అమ్ముడుపోయాయి.
 
 నెల            ఐఎంఎల్ కేసులు    బీరు కేసులు    విలువ (రూ.)
 2015 ఏప్రిల్    78,867           1,80,242        47,21,15278
 మే                90,364            2,30,531        54,58,50608
 జూన్              58,760            1,73,105        38,81,84,770  
 జూలై             1,11,113           1,70,791        58,92,08,658
 ఆగస్టు            78,235             1,19,789        40,76,61,666
 సెప్టెంబర్          48,522             95,242          27,17,69,656
 అక్టోబర్           1,38,435           2,06,761       76,02,64,391
 నవంబర్          97,652             1,58,120        52,07,89,539
 డిశంబర్          1,09,775          1,75,758         60,55,09,113
 జనవరి16        92,161             1,19,121        46,22,98,680
 పిబ్రవరి            92,286             1,71,111         51,44,86,320
 మార్చు           95,432             2,20,898         57,81,99,343
 ఏప్రిల్              89,798             2,27,686         55,82,81,098

మరిన్ని వార్తలు