కష్టపడి రుణమాఫీ చేశా : చంద్రబాబు

7 May, 2016 20:11 IST|Sakshi

కడప: కష్టపడి రుణమాఫీ చేశామని... వేరే వారైతై ఆ పని చేయలేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం వైఎస్ఆర్ జిల్లా కడపలో ఉద్యాన పంటల రైతులకు రుణ ఉపశమన పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.... విభజన చట్టంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. కట్టుబట్టలతో వచ్చామన్నారు.

తెలంగాణ ఆదాయం 11 శాతం ఉంటే... మన ఆదాయం చాలా తక్కవ ఉందని చెప్పారు. జనాభా ఎక్కువ ఉన్నారని.... ఇతర రాష్ట్రాల కంటే రూ.35 వేలు తలసరి ఆదాయం తక్కువగా ఉందని... ఈ పరిస్థితుల్లో రైతులకు రుణవిముక్తి కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరోకరు అయితే రుణమాఫీ సాధ్యపడేది కాదని ఆయన పేర్కొన్నారు.

టెక్నాలజీని వ్యవసాయ రంగంలోకి ప్రవేశపెట్టడం ద్వారా అధిక ఆదాయం గడించ వచ్చుని తెలిపారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని కొంతమంది పెద్దమనుషులు మాట్లాడుతున్నారని... 10 ఏళ్లుగా వారు ఆ ప్రాంతానికి ఏం చేశారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమ ప్రయోజనం కోసమే నిర్మించామని ఆయన చెప్పారు. కడపను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని వివరించారు.

మరిన్ని వార్తలు