సిటీ బస్ స్టార్ట్

16 Mar, 2016 04:09 IST|Sakshi
సిటీ బస్ స్టార్ట్

 ఖమ్మం నగర రోడ్లపై లోకల్ బస్సులు రయ్య్‌మ్రంటూ చక్కర్లు కొట్టనున్నాయి. మంగళవారం మంత్రి తుమ్మల సిటీబస్‌లను ప్రారంభించి, అందులో ప్రయాణించారు. నగరంలో తొలివిడతగా ఇల్లెందు రూట్‌లో ఎనిమిది, బోనకల్ రూట్‌లో నాలుగు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది.     -ఖమ్మం మామిళ్లగూడెం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నగరంలో సిటీ బస్సులు ప్రారంభం

ఖమ్మం మామిళ్లగూడెం : ఆర్టీసీ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం రీజియన్‌కు కొత్తగా వచ్చిన సిటీ బస్సులను నగరంలోని ఎన్నెస్పీలో గల కొత్త బస్టాండ్ స్థలంలో మంత్రి తుమ్మల మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను రక్షించుకునేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు సహకారం అందించాలన్నారు. అలాగే నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దటానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఆర్టీసీ ఆర్‌ఎం శివకుమార్, డిప్యూటీ సీటీఎం రామ్మూర్తినాయక్, సీఎంఈ జాన్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ కె.లక్ష్మణ్, డీఎం సుగుణాకర్, సీఐ మహేష్‌కుమార్, పీజీడీఐ వినాయకరావు, ఎస్‌డీఐ ప్రభాకర్, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ కార్యదర్శి గడ్డం లింగయ్య, డిపో అధ్యక్షుడు తోకల బాబు, వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

 టీఎంయూ వినతి
డిపో పరిధిలో దాదాపు 160 బస్సులు నడుస్తున్నాయని, ప్రస్తుతం మంత్రి చొరవతో కొత్త 30 బస్సులు వస్తున్నాయని టీఎంయూ కార్యదర్శి ఎన్‌వీ.భద్రంతెలిపారు. పాలనాపరమైన ఇబ్బం దులను ఎదుర్కోవడానికి మరో డిపో ఏర్పాటు చేయాలని కోరారు. బస్సులను బైపాస్ ద్వారా మళ్లించడంవల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందు లు పడాల్సి వస్తోందన్నారు. అలాగే ఖమ్మం రీజియన్‌లో 3వేల మంది కార్మికులు పని చేస్తున్నారని, వారికి సొంతిళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు. కాగా, వినతిపత్రం అందించిన వారిలో రీజి యన్ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, ఎన్‌వీ.భద్రం, డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఎన్.రెడ్డి, శంకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు