ఏమి ‘సేతు’ను స్వామీ!

13 Dec, 2016 22:40 IST|Sakshi
ఏమి ‘సేతు’ను స్వామీ!
  • భారీ వాహనాలతో ఇబ్బందులు పడుతున్నా!
  • కలెక్టర్‌ ఆపమన్నారు.. మంత్రి చలోచలో అన్నారు
  • ‘‘అయ్యా! గౌరవనీయులైన కలెక్టర్‌గారికి.. నేను గుర్తున్నానా! సారూ! లొల్లలాకులపై నిర్మించిన వంతెనను. కాట¯ŒSదొర కాలంలో పుట్టిన నేను ప్రజలకు విశేష సేవలందించాను. ఎన్నో బరువులు మోసీ..మోసీ చివరికి ఇలా బలహీనపడిపోయాను. గతేడాది ఓ రోజు అటుగా వచ్చిన మీరు నా పరిస్థితిని గమనించి.. నా మీదుగా భారీ వాహనాలు రాకుండా నిషేధించారు. అంతేకాదు నిషేధాజ్ఞలను తెలిపేలా హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయించారు. మీలో స్పందించే గుణం ఉందని ఎంతో సంతోషించాను. కొన్నేళ్లు భూమిపై ఉండొచ్చని ఆశపడ్డాను.తీరా..ఇటీవల లొల్లలాకులను పరిశీలించిన జిల్లా ఇ¯ŒSచార్జి మంత్రి, రాష్ట్ర ఇరిగేష¯ŒS మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నా ఆశలపై నీళ్లు చల్లారు. నా మీదుగా భారీ వాహనాలు తిరగవచ్చనే ఆర్డర్‌ వేశారు. ఇంకేముంది? భారీ, అతి భారీ వాహనాలు రయ్‌రయ్‌ అంటూ వెళుతున్నాయి. రోజూ వందలాది ఇసుకలారీలు అతివేగంగా వెళుతుంటే.. నేను త్వరలోనే కుప్పకూలిపోతానేమోనని భయమేస్తోంది. ఇక నాకు ఈ భూమిపై నూకలు చెల్లినట్టేననిపిస్తోంది. మరోవైపు నా బాధను ఇరిగేష¯ŒS శాఖ వాళ్లు కూడా పట్టించుకోవడం లేదు. ఇసుక రీచ్‌ నిర్వాహకులతో లాలూచీ పడిపోయారు. యథేచ్ఛగా వాహనాల రాకపోకలకు అనుమతులిచ్చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు, రైతులకు సేవలందించిన నా పరిస్థితిని ఎవ్వరూ
    పట్టించుకునే వారే లేరా?’’                  – ఆత్రేయపురం
     
మరిన్ని వార్తలు