మురుగులమ్మకు 365 గజాల చీర!

19 Nov, 2015 02:25 IST|Sakshi
మురుగులమ్మకు 365 గజాల చీర!

తూర్పు గోదావరి జిల్లా బండార్లంకలోని చేనేత కార్మికులు ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా 365 గజాల చీరను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన అతి పెద్ద పడుగు (చీర తయూరీకి అవసరమైన నూలును కర్రలపై పరిచి సాఫు చేసే ప్రక్రియ)తో పట్టిన అల్లు (నూలును నేసేందుకు వీలుగా చుట్టే పనిముట్టు) చూసేందుకు జనం తరలివచ్చారు. గురువారం నుంచి బండార్లంకలోని చేనేత సహకార సంఘం మగ్గంపై నల్లా సత్యానందం, ఈశ్వరి దంపతులు ఈ చీరను నేస్తారు.  ఈ చీరను గ్రామదేవత  గంగాదేవి మురుగులమ్మవారికి సమర్పిస్తామని వరదరాజులు చెప్పారు.   
 - అమలాపురం రూరల్

మరిన్ని వార్తలు