వ్యసనాలకు బానిసలు కావొద్దు

25 Jul, 2016 23:35 IST|Sakshi
  • గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌
  • సెంటినరీకాలనీ : ఎంతో గొప్ప భవిష్యత్‌ కలిగిన విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ సూచించారు. సెంటినరీకాలనీలోని మంథని జేఎన్‌టీయూ కళాశాలలో సోమవారం విద్యార్థులో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. రానున్న కాలంలో విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు కఠోర దీక్షతో కృషి చేయాలన్నారు. అప్పుడే లక్ష్యం నెరవేరి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని వివరించారు. ర్యాగింగ్, గంజాయి, అల్కహాల్‌లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేయవద్దని ఆయన సూచించారు. ఈ కార్యాక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌రెడ్డి, సీఐ దేవారెడ్డి, ఎస్సై ప్రదీప్‌కుమార్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు