గురు పౌర్ణమి గరుడోత్సవం

20 Jul, 2016 07:44 IST|Sakshi
గరుడవాహనంపై విహరిస్తున్న శ్రీవారు


మలయప్ప దర్శనంతో భక్తకోటి తన్మయత్వం
– వేడుకగా సాగిన ఊరేగింపు

సాక్షి,తిరుమల:
గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా మంగళవారం తిరుమలలో గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది.  పౌర్ణమి సందర్భంగా  పురవీ«ధుల్లో మలయప్ప గరుడవాహనంపై దర్శనమివ్వటం ఆలయ సంప్రదాయం. సాయంసంధ్యాసమయం పూజలు ముగించుకుని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కొలువు మండపంలో వేంచేపు చేశారు. వేయి నేతిదీపాల వెలుగులో సహస్త్ర దీపాలంకరణసేవలో స్వామివారు  భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేశారు. భక్తాగ్రేసుడైన గరుడునిపై ఆశీనులైన మలయప్పను  అర్చకులు విశేష ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరించారు. రాత్రి 7 గంటలకు  భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నడుమ ప్రారంభమైన ఊరేగింపు  రాత్రి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధులో ్ల సాగింది.   భక్తుల హారతి నడుమ స్వామివారు దర్శనమిస్తూ కనువిందు చేశారు. పౌర్ణమిల్లోనే విశేష పర్వదినమైన  గురుపౌర్ణమి  కావటంతో భక్తుల అశేష సంఖ్యలో హాజరై ఉత్సవర్లను దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో చదలవాడ ష్ణమూర్తి, జేఈవో శ్రీనివాసరాజు, డెప్యూటీఈవో కోదండరామారావు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు