ఎన్నెన్నో రూపాలు

3 Sep, 2016 18:25 IST|Sakshi
ఎన్నెన్నో రూపాలు
  • వెయ్యికి పైగా వినాయక రూపాలు సేకరణ
  • ఆల్బమ్‌లో భద్రపరిచిన వెంకటేశ్వర్లు
  • కమాన్‌చౌరస్తా : ఆకులు.. పండ్లు.. రాళ్లు.. నవధాన్యాలు..కరెన్సీ..వజ్రాలు..గంధం..కాగితాలు ఇలా ఎందెందు కొలిచినా అందందూ కలడు అన్నట్లు వినాయకుడి అన్ని రూపాల్లో కనిపిస్తుంటాడు. విజ్ఞాలను తొలగించి మెుదటి పూజను అందుకునే ఆది దేవుడు ఎన్నో రూపాల్లో దర్శనమిస్తుంటాడు. గణేశ్‌ రూపాలను సేకరించే పనిలో పడ్డారు కరీంనగర్‌కు చెందిన కర్నబత్తుల వెంకటేశ్వర్లు. ఆయన ఆధ్యాత్మిక ఆసక్తిపై ప్రత్యేక కథనం.
     
    పదేళ్లుగా..
    కరీంనగర్‌లో టాక్స్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు 2007 నుంచి ఇప్పటివరకు వినాయకుడి రూపాలను సేకరించే పనిలోనే ఉన్నారు. వెయ్యి రూపాలను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకోగా..దాన్ని పూర్తి చేశారు. శుభలేఖలు, దినపత్రికలు, పోస్టర్లు, వివిధ మ్యాగజైన్లు, వివిధ యాత్రల్లో లభించిన రూపాలన్నింటిని భద్రపరుస్తూ ఆల్బమ్‌ తయారు చేశారు. కొత్త రూపం కనిపిస్తే భద్రపరుస్తుంటారు. 
     
    వివిధ తీర్థయాత్రలకు వెళ్లిన సమయంలోనూ అక్కడ కొత్త రూపంలో వినాయకుడి ఫొటోలు కనిపిస్తే చాలు కొని తన దగ్గర భద్రపరుచుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వెళ్లి అక్కడ వందకుపైగా వినాయకుడి రూపాలను సేకరించారు.  
    భిన్నరూపాలు 
    వెంకటేశ్వర్లు సేకరించిన వినాయకుడి చిత్రాల ఆల్బమ్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. కరెన్సీ, వజ్రాలు, మట్టి, గంధం, రాళ్లు, కాగితాలు, బియ్యం, గవ్వలు, నవధాన్యాలతో తయారు చేసిన వినాయకులతోపాటు పంచముఖ రూపం, శివుని రూపం, బాలగణేషులతోపాటు ఎన్నో సుందర రూపాలు ఉన్నాయి. 
     
    లక్ష్యాన్ని చేరుకున్నాను 
    –కె.వెంకటేశ్వర్లు, టాక్స్‌ కన్సల్టెంట్‌ 
    వినాయకుడంటే చిన్నప్పటి నుంచి అమితి భక్తితో ఉండే వాడిని. గణేశుడి రూపాలను పరిశీలిస్తే చాలా రకాలుగా ఉండడంతో ఆసక్తి కలిగింది. 2007 నుంంచి ఇదే పనిలో ఉన్నాను. వెయ్యి రకాలు సేకరించాలనే లక్ష్యం పెట్టుకోగా..అంతకుమించి లభిస్తుండడంతో సేకరిస్తూనే ఉన్నాను.  
     
     
     
మరిన్ని వార్తలు