శేష వాహనంపై గౌరీపుత్రుడు

9 Sep, 2016 23:31 IST|Sakshi
శేషవాహనం పై ఊరేగుతున్న స్వామి వారు
–పులకించిన భక్తజనం
కాణిపాకం(ఐరాల):
 స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక  బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్ద శేషవాహనంపై ఆలయ మాడవీధులు, కాణిపాకం పురవీధుల్లో  విహరించారు. శేష వాహన ఉత్సవానికి కాణిపాకం, కాకర్లవారిపల్లె, వడ్రాంపల్లె, మిట్టిండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, బొమ్మసముద్రం, తిమ్మెజీపల్లె, తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లెలకు చెందిన కమ్మ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామి వారి మూల విగ్రహనికి సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. నివేదన  చేసి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు.రాత్రి స్వామివారికి పెద్దశేషవాహన సేవ నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో ఉంచారు. ఊరేగింపుగా వచ్చిన ఉభయదారుల ఉభయంతో  ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకి పై తీసుకు వచ్చి  పెద్దశేషవాహనంపై అధిష్టింప చేశారు.ప్రత్యేక పూజల అనంతరం  కాణిపాకం పురవీధుల్లో మేళతాళాలు,మంగళవాయిద్యాలనడుమ ఊరేగించారు. ఈకార్యక్రమంలో ఉభయదారులు,ఉత్సవకమిటీ సభ్యులు,అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు