యాళి వాహనం పై వరసిద్ధుడి వైభవం

17 Sep, 2016 23:41 IST|Sakshi
యాళి వాహనం పై ఉత్సవమూర్తి
 
– వేడుకగా ప్రత్యేకోత్సవాలు
కాణిపాకం(ఐరాల): స్వయంభువు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు యాళి వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో స్వామివారి మూలవిగ్రహనికి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని చందనాలంకృతులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. రాత్రి సిద్ధి బుద్ధి సమేతులైన స్వామివారి ఉత్సవ మూర్తులను  అలంకార మండపంలోకి వేంచేపు చేసి, విశేషాలంకరణ చేశారు. తరువాత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి పల్లకిపై  ఊరేగింపుగా తీసుకువచ్చి యాళి వాహనంపై అధిష్టింపజేశారు. మంగళవాయిద్యాలు, మేళతాలాల నడుమ కాణిపాకం పురవీధులు, మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం వారు, అగరంపల్లికి చెందిన నరశింహరెడ్డి కుమారులు, చినకాంపల్లికి చెందిన సుబ్బారెడ్డి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పి.పూర్ణచంద్రారావు, ఏసీ వెంకటేష్, ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్‌ రవీంద్ర బాబు, స్వాములు, ఇన్‌స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున, ఉత్సవ కమిటీ సభ్యులు, ఉభయదారులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు