ఘోర రోడ్డుప్రమాదం : ఐదుగురి మృతి

30 Jun, 2016 09:27 IST|Sakshi

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మేదరమెట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును టిప్పర్ కొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

పాత గుంటూరుకు చెందిన విద్యుత్ శాఖ రిటైర్డు అధికారి మాచర్ల వీరాస్వామి తన మనవరాలు నిత్య(9 నెలలు) పుట్టు వెంట్రుకలు తీయించేందుకు 12 మంది కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. తిరుమల దర్శనం ముగించుకుని తిరిగి గుంటూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులోని ముగ్గురు కిందికి దిగి ముందుకు తోసేందుకు యత్నిస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కిందనున్న ముగ్గురూ త్రుటిలో తప్పించుకున్నారు. కారు డ్రైవర్ సహా అందులోని నలుగురు చిన్నారులు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను కృష్ణ(3), నిత్య(1), చిన్నికృష్ణ(4), వాసవి(4) గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు