రోడ్డు ప్రమాదంలో లారీ డ్రై వర్‌ మృతి

26 Sep, 2016 00:10 IST|Sakshi
దేవరాజుగట్టు (పెద్దారవీడు): ప్రకాశం జిల్లా దేవరాజుగట్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాణ్యంకు చెందిన ఓ లారీ డ్రై వర్‌ దుర్మరణం చెందాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు నుంచి నాపరాయితో సున్నిపెంటకు వెళ్తున్న రెండు లారీలు ఆదివారం తెల్లవారు జామున ఒకదాని తర్వాత ఒకటి వరసగా దేవరాజుగట్టు సమీపంలో ఆగాయి. డ్రై వర్లు, క్లీనర్లు కిందకు దిగి టైర్లను పరిశీలించుకుంటున్నారు. ఇంతలో అనంతపురం నుంచి విజయవాడకు పచ్చి మిరపకాయల లోడుతో వెళ్తున్న డీసీఎం లారీ ఆగి ఉన్న రెండు లారీలను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆగి ఉన్న లారీలకు చెందిన డ్రై వర్‌ షేక్‌ గౌసెలాజం (25) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది కర్నూలు జిల్లా పాణ్యం. మిరపకాయల లోడు లారీలో ఉన్న ఆనంతపురం మండలం కురుకుంట వైఎస్సార్‌ కాలనీకి చెందిన వ్యాపారి తలారి రమేష్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు.మతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.  
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు