ప్రేమ పేరుతో వేధింపులు..

28 Dec, 2016 00:47 IST|Sakshi

రేవనపల్లి(భూదాన్‌పోచంపల్లి) : ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. విష యం తెలుసుకున్న ఆ యువకుడు కూడా కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. మృతురాలి కుటుంబసభ్యులు, ఎస్‌ఐ రాఘవేంద్రగౌడ్‌ కథనం ప్రకారం.. మండల కేంద్రం పరిధిలోని బస్వలింగేశ్వరకాలనీకి చెందిన వలందాసు రమేశ్‌కు నలుగురు కుమార్తెలు. వీరిలో మూడవ కుమార్తె వలందాసు శ్వేత(18) టెన్త్‌ వరకు చదివింది. ఆ తరువాత ఇంట్లో మగ్గం నేస్తూ, ఇటు ఓపెన్‌ యూనివర్సిటీ  ఇంటర్‌ చేస్తుంది. కాగా మండలంలోని రేవనపల్లికి చెం దిన నారి బాలకృష్ణ అనే యువకుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌. ఇ తను శ్వేతను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. దాంతో  రెండేళ్ల క్రితం గ్రామంలో పంచాయతీ పెట్టి పెద్ద మనుషులు నచ్చజెప్పారు. దాంతో కొద్దిరోజులు దూరంగా ఉన్నాడు. ఇటీవల తిరిగి శ్వేతతో మాట్లాడం, పెళ్లి చేసుకుందామని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న అర్థరాత్రి శ్వేత ఇంటికి వచ్చిన బాలకృష్ణ కిటికీలోంచి రాయి విసరడంతో శ్వేత తండ్రి రమేశ్‌ నిద్రలేచి, అతనిని పట్టుకునేందుకు వెంబడించా డు. దీంతో బాలకృష్ణ బైక్‌ను వదిలి పారిపోయాడు.

మాత్రలు మింగి...
యువకుడి వేధింపులు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు శ్వేతను బంధువుల ఇంటికి పంపించాలని నిశ్చ యించారు. ఈ నెల 25న బీబీనగర్‌ మం డలం చిల్కగూడెంలో ఉంటున్న మేనమామలు వచ్చి శ్వేతను బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో శ్వేత అస్వస్థతకు గురైంది. ఏమైందని మేనమామలు ప్రశ్నించడంతో ఇంటి వద్ద మా త్రలు మింగానని చెప్పడంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో  డాక్టర్ల సలహామేరకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ శ్వేత మంగళవారం మృతి చెందింది. యువకుడి వేధింపుల వల్లే శ్వేత ఆత్మహత్యకు పాల్పడిం దని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు  మంగళవారం రాత్రి బాలకృష్ణ ఇంటి ముందు వేసి ఆందోళనకు దిగారు.  శ్వేత మృతి చెందిందని విషయం తెలుసుకున్న బాలకృష్ణ భయంతో సాయంత్రం ఇంట్లో కలుపుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కు టుంబసభ్యులు   ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు