వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

31 Jul, 2016 16:58 IST|Sakshi

విశాఖ: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా తీరానికి సమీపాన ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు ఆదివారం విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాకు చెదురుమదురు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

ఈ నేపథ్యంలో కోస్తా తీరం వెంబడి పశ్చిమదిశగా గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయనీ, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, అయితే రాయలసీమలో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తలు