నాణ్యతలేని సరుకుల సరఫరా

9 Jun, 2017 18:30 IST|Sakshi

భద్రాచలం: ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఆశ్రమాలు, వసతి గృహాలకు నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి మాలోతు సైదా అన్నారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆశ్రమాలకు గిరిజన సహకార సంస్థ ద్వారా సరుకులు సరఫరా చేసే నిమిత్తం టెంటర్‌లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలో విద్యనభ్యశించే విద్యార్ధుల సంక్షేమం కోసమని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.

సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత లోపిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా పాఠశాలలకు అవసరాలకు అనుగుణంగా సకాలంలో వాటిని సరఫరా చేయాలన్నారు. ఈ విషయంలో అలసత్వంగావ్యవహరించే వారి కాంట్రాక్టులను రద్దు చేస్తామన్నారు. వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసర సరుకులను జీసీసీ అధికారులు, ఏటీడబ్ల్యూవోలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నాణ్యత ధృవీకరణ చేసిన మీదటే వాటిని పంపిణీ చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్‌లను బ్లాక్‌ లిస్టులో పెడతామన్నారు. కార్యక్రమంలో జీసీసీ డివిజనల్‌మేనేజర్‌ విజయ్‌కుమార్‌; ఏటీడబ్ల్యూవో జహీరుద్ధీన్, సూపరింటింటెండ్‌ నారాయణ రెడ్డి, జీసీసీ మేనేజర్‌లు శంకర్, సతీషకుమార్, సత్యనారాయణ, రామాంజనేయలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు