మద్ది అంజన్నకు పంచామృతాభిషేకం

23 May, 2017 21:56 IST|Sakshi
మద్ది అంజన్నకు పంచామృతాభిషేకం
జంగారెడ్డిగూడెం రూరల్‌ (చింతలపూడి) : హనుమద్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు దంపతులతో ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ ఇందుకూరి రంగరాజుతో నిత్య హోమ బలిహరణ పూజలు జరిపారు. ఒక్కరోజు ఆదాయం రూ.1,35,473 ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 
‘మద్ది’లో నేడు:
మద్దిక్షేత్రంలో జరుగుతున్న హనుమద్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా  బుధవారం హనుమత్‌ దీక్షాధారులు ఇరుముళ్లు సమర్పిస్తారని ఆలయ చైర్మన్‌ యిందుకూరి రంగరాజు, ఈఓ విశ్వనాథరాజు  తెలిపారు.  రాష్ట్రం నలు మూలల నుంచి దీక్షాధారులు మద్ది చేరుకుంటారని వారు పేర్కొన్నారు.  ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి జరుపుతామన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు