నవంబర్‌ 20 మాదిగల ధర్మయుద్ధం

18 Sep, 2016 22:28 IST|Sakshi

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు గాను మాదిగల ధర్మయుద్ధం పేరుతో నవంబర్‌ 20న హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాదిగ విద్యార్థి విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి  సంగమేశ్వర్‌ తెలిపారు. ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 20న నిర్వహించే మహా సభకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావాలని పిలుపు నిచ్చారు.  అందులో భాగంగానే ఈ నెల 20న జహీరాబాద్‌ నుంచి పాద యాత్ర ప్రారంభిస్తామన్నారు.  సమావేశంలో నాయకులు సింహచలం, శ్రీహరి, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు