3న మహాదర్నా

29 Aug, 2016 23:12 IST|Sakshi
3న మహాదర్నా

కడప కార్పొరేషన్‌:
 రాయసీమ ప్రాంత రైతాంగంపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు నిరసనగా సెప్టెంబర్‌ 3న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించే రైతు మహాధర్నాను జయప్రదం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా, పార్టీ అనుబంధ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  రెండున్నర సంవత్సరాలు పూర్తయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేయలేదని, జిల్లాలో ఉక్కుఫ్యాక్టరీని నెలకొల్పలేదన్నారు. సాగునీరు, తాగునీటి విషయంలో సీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని జిల్లాల్లో అందోళనలు, దీక్షలు నిర్వహించినప్పటికీ వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఒక్క ఆందోళన కూడా చేయలేదన్నారు. మూడేళ్ల తర్వాత నిర్వహింబబోయే ఈ ధర్నాకు భారీగా జన సమీకరణ చేయాలన్నారు. ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ బ్రహ్మంసాగర్‌కు, గండికోటకు 12 టీఎంసీల చొప్పున నీళ్లిస్తామని ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి గంటా మాట ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం ఆ మాటను తప్పుతోందన్నారు. సమావేశంలో పార్టీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్, రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు,  నగర అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, అనుంబంధ సంఘాల అధ్యక్షులు చల్లా రాజశేఖర్, పులి సునీల్, వేణుగోపాల్‌ నాయక్, నాగేంద్రారెడ్డి, ఖాజా, పత్తి రాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, ఆదిత్య పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు