‘మహా’ సంబరాలు

23 Aug, 2016 20:37 IST|Sakshi
మిఠాయిలు తినిపించుకుంటున్న ఎంపీ, ఎమ్మెల్యే
  • సంగారెడ్డిలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, నాయకులు
  • సాక్షి, సంగారెడ్డి: నీటి పంపకాల విషయంలో తెలంగాణ సర్కార్‌ మహారాష్ట్రతో కుదుర్చుకున్న మహా ఒప్పందం నేపథ్యంలో సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వ అతిథి గృహం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అక్కడి నుంచి పాత బస్టాండు వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.  ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు.

    తెలంగాణకు మేలు
    మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం కేసీఆర్‌ కుదుర్చుకున్న ఒప్పందాలతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. ఈ ఒప్పందంతో గోదావరి నదిపై తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పనులు వేగవంతమవుతాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్‌ వల్ల సాగునీటి రంగంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 

    మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌, సీడీసీ చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, కొండాపూర్‌ ఎంపీపీ విఠల్, కౌన్సిలర్‌ మురళీ, నాయకులు శ్రీనివాస్‌చారి, చెర్యాల ప్రభాకర్, బొంగుల రవి, కసిని విజయ్‌కుమార్, జలాలుద్దీన్‌ బాబా, ఆర్‌.వెంకటేశ్వర్లు, జీవీ శ్రీనివాస్, సుభాన్, రషీద్, సుభాష్, మారుతి, నాని, రాజేందర్‌నాయక్, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా