మహాత్మా.. మన్నించు

2 Oct, 2016 23:35 IST|Sakshi
మహాత్మా.. మన్నించు
కోల్‌సిటీ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి, జాతీయ అహింసా దినత్సోవం అయిన ఆదివారం రోజు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మాంసం, మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగాయి. గాంధీజీ జయంతి రోజున దేశంలో మాంసం, మద్యం విక్రయాలను ప్రభుత్వాలు నిషేధించాయి. ఆ మహానీయుని త్యాగాలను స్మరించుకుంటూ... గాంధీజీ ఆశయాలను కొనసాగించడానికి నిషేదపు ఆజ్ఞలు విధించారు. కానీ, స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ మార్కెట్‌లో మటన్, చికెన్, చేపలను వ్యాపారులు బహిరంగంగా మాసం విక్రయించారు. మరిన్ని చోట్ల కూడా కొందరు వ్యాపారులు మటన్, చికెన్‌ విక్రయించారు. బహిరంగ విక్రయాలపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పవన్‌కుమార్, కిశోర్‌కుమార్‌తోపాటు సూపర్‌వైజర్లు మార్కెట్‌లో మొక్కుబడిగా దాడి చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపించాయి. అధికారులు మాంసం విక్రయించిన నిర్వాహకుల దుకాణాలను సీజ్‌ చేశారు. కొందరు వ్యక్తులు నగరంలోని వైన్‌షాపుల సమీపంలో చాటుగా అధిక ధరలకు మద్యం విక్రయించారు.
 
 
మరిన్ని వార్తలు