కారెక్కనున్న ఒకే ఒక్కడు!

31 May, 2016 02:26 IST|Sakshi
కారెక్కనున్న ఒకే ఒక్కడు!

టీడీపీని వీడనున్న మల్కాజిగిరి  ఎంపీ మల్లారెడ్డి
సన్నిహితులతో చర్చలు  ఒకట్రెండు రోజుల్లో స్పష్టత

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ మేడ్చల్:  తెలుగుదేశం పార్టీకి జిల్లాలో మరో ఎదురుదెబ్బ తగలనుంది. 2014 ఎన్నికల్లో బలంగా వీచిన గులాబీ పవనాలను ఎదుర్కొని మల్కాజిగిరి నుంచి విజయం సాధించిన ఒకే ఒక్క ఎంపీ చామకూర మల్లారెడ్డి ఆ పార్టీని వీడడానికి రంగం సిద్ధమైంది. పాలవ్యాపారి నుంచి విద్యాసంస్థల అధినేతగా మారిన మల్లారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీలో చేరిక ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేశారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన రేవంత్‌రెడ్డిని కాదని టీడీపీ అధిష్టానం మల్లారెడ్డికి టికెట్ కేటాయించ డం.. విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం జరి గిన పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారిపోయాయి. జిల్లాలో టీడీపీ బలహీనపడింది.

తెలంగాణలోనే అత్యధిక శాసనసభ  స్థానాలు గెలిచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలో పరిస్థితుల వేగంగా మారిపోయి.. టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో ఒక్కో ఎమ్మెల్యే జారుకున్నారు. దాదాపు ఎమ్మెల్యేలంతా (ఎల్‌బీనగర్ కృష్ణయ్య మినహా) కారెక్కారు. ఎమ్మెల్యేలతోపాటు పార్టీ శ్రేణులు కూడా వలసబాట పట్టాయి. దీంతో జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికితోడు  విద్యాసంస్థలను నిర్వహిస్తున్న చామకూరకు ప్రభుత్వ సహకారం తప్పనిసరైంది. పచ్చపార్టీలో కొనసాగడం ఆయనకు ప్రతికూలంగా మారిం ది.  ఈ క్రమంలోనే గులాబీ గూటికి దగ్గరవుతున్న ట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌లో ఆయన చేరికపై కొన్నిరోజులుగా సంకేతాలు అందుతున్నా.. సోమవారం ఆయన తన సన్నిహితుల వద్ద ‘దేశం’ను వీడడంపై స్పష్టత నిచ్చినట్లు తెలిసింది. అధికారపార్టీలో చేరడం ద్వారా ఒనగూరే ప్రయోజనా లు.. టీడీపీలో కొనసాగడంతో వచ్చే ఇబ్బందులను ఏకరువు పెట్టిన చామకూర.. గులాబీ కండువా కప్పుకోవడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు అంతరంగాన్ని వెల్లడించినట్లు సమాచారం.

మేడ్చల్ ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డితో అంటీముట్టనట్లు వ్యవహరించే చామకూర.. వారంరోజులుగా కలివిడిగా మెలడం..  2 నెలల క్రితం పార్టీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎమ్మె ల్యే ఒకరితో రాయభారం నెరపడం ద్వారా గులాబీ గూటికి లైన్‌క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ అధినాయకత్వంతో కొన్ని రోజులుగా టచ్‌లో ఉన్న మల్లారెడ్డి పార్టీ మా ర్పుపై ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయాన్ని ప్రకటిం చే అవకాశముంది. ఇదలావుండగా, టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై సోమవారం ఉదయం నుంచి మీడియాలో కథనాలు వస్తున్నా.. ఖండించకపోవడం చూస్తే ఆయన కారెక్కడం ఖాయమని స్పష్టమవుతోంది.

 మల్లారెడ్డి బాటలో తమ్ముళ్లు
గులాబీ కండువా కప్పుకునేందుకు తన అనుచరులతో రెండు రోజులుగా వుంతనాలు జరిపి టీఆర్‌ఎస్‌లో చేరడానికి నిర్ణయుం తీసుకున్నట్లు మేడ్చల్ టీడీపీ వర్గాలు తెలిపారుు. ఎంపీకి ప్రధాన అనుచరుడు, వుండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, కండ్లకోయు గ్రావు సర్పంచ్ నరేందర్‌రెడ్డి, వుండలంలో ఎంపీకి అన్ని తామై వ్యవహరిస్తున్న నర్సింహారెడ్డి, భాగ్యరెడ్డితో పలు గ్రావూల సర్పంచ్‌లు కారెక్కడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సవూచారం. మొదట జూన్ 3వ తేదీనే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణరుుంచుకున్నప్పటికీ.. రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని జూన్ 15కు వాయిదా వేసుకున్నట్టు సమాచారం. ఇదే విషయూన్ని టీడీపీ నాయుకులతోపాటు టీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు