23 మంది విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులు

25 Mar, 2017 23:54 IST|Sakshi
కర్నూలు(ఆర్‌యూ): శనివారం జరిగిన రెండో సెమిస్టర్‌ డిగ్రీ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన 23 విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేశారు. నందికొట్కూరు వైష్ణవి కళాశాలలో ఇద్దరు, కర్నూలు డిగ్రీ కళాశాల సెంటర్‌లో ఒకరు, కోవెలకుంట్ల ఎస్‌.వి డిగ్రీ కళాశాల సెంటర్‌లో ముగ్గురు, ఎమ్మిగనూరు రావూస్‌ కళాశాల సెంటర్‌లో ఇద్దరు, వైష్ణవి డిగ్రీ కళాశాల సెంటర్‌లో ఒకరు, కోడుమూరు సాయిరాం సెంటర్‌లో 14 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో రెండు రోజులుగా మొత్తం 31 మంది విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేశామని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విద్యార్థుల పరీక్ష పేపర్లను తనిఖీ చేసి ప్రత్యేక కమిటీ నిర్ణయం ద్వారా ఒకటి లేదా రెండుసార్లు పరీక్షలకు అనుమతించకుండా చేసే అవకాశాలున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్‌ బి.అమర్‌నాథ్‌ తెలిపారు.
 
మరిన్ని వార్తలు