గ్రామం సజీవ సమాధి

6 Mar, 2016 17:24 IST|Sakshi
మట్టి దిబ్బల కింద ఉన్న మామిడిగొంది గ్రామం

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవ రేఖ. ఈ ప్రాజెక్టు వస్తే కృష్ణాడెల్టాకు నీటి కష్టాలు తీరుతాయి. విశాఖపట్నంకు తాగునీరు అందుతుంది. ఇదంతా నాణేనికి ఒకైవెపు. మరోవైపు ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో గ్రామాలు కనుమరుగైపోతున్నాయి. ఈ విధంగా సజీవ సమాధి అయిపోతున్న గ్రామమే పోలవరం మండలం ‘మామిడిగొంది’. ఒకప్పుడు 160 గడపలతో పచ్చటి చెట్లు, చక్కటి పంట పొలాలు, పశుపక్ష్యాదులతో క ళకళలాడిన గ్రామమే ఇది.

ఇప్పుడు ఈ గ్రామాన్ని ప్రభుత్వం ఖాళీ చేయించి మరోచోటికి తరలించింది. గ్రామాన్ని వదిలివెళ్లిపోయే వారు తమ ఇళ్ల కర్రలు, ఆకులు, సామగ్రిని తీసుకుపోయారు. గుడి-బడి, వాటర్ ట్యాంక్ పక్కా నిర్మాణాలు కావటం అవి అలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామం పోలవరం ప్రాజెక్టు కోసం తవ్వుతున్న మట్టి కింద సజీవ సమాధి అయిపోతోందని తెలియజేసే సజీవ చిత్రమే ఇది.

గ్రామానికి చెందిన గుడి (సాయిబాబా చిత్రం ఉన్న భవనం) పక్కనే బడి, గ్రామస్తులకు మంచినీటిని అందించిన వాటర్ ట్యాంక్ మరికొద్ది రోజుల్లో మట్టిదిబ్బలతో మూసుకుపోనున్నాయి. వాటిని చూసి గ్రామస్తులు ఎంతో ఖేదంతో ఉన్నారు.   

-ఫొటో: వీరభగవాన్ తెలగారెడ్డి, విజయవాడ

మరిన్ని వార్తలు