ఎస్సై వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

7 Jan, 2016 22:26 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఎస్సై వెంకటప్రసాద్ ఓవరాక్షన్తో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రత్యర్థుల ఫిర్యాదుతో 14 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. అయితే కోర్టులో బెయిల్ తెచ్చుకున్నప్పటికీ పోలీస్ స్టేషన్కు పిలిచి ఎస్సై వేధిస్తున్నట్టు ఎస్సైపై ఆరోపణలు వెలువెత్తాయి.

ఈ క్రమంలో ఎస్సై వేధింపులు పడలేక నాగరాజు అనే కార్యకర్త పురుగలమందు తాగి ఆత్మహత్యాయత్నం  చేసినట్టు తెలిసింది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు