'కౌన్ బనేగా..' పేరుతో మోసం

12 Sep, 2015 16:22 IST|Sakshi
'కౌన్ బనేగా..' పేరుతో మోసం

అల్లీపురం: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎమ్మెస్సీ విద్యార్థినిని 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం పేరుతో మోసగించిన నిందితుడ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ చక్రవర్తి కొన్ని రోజుల క్రితం ఆంధ్రా వర్సిటీ ఎమ్మెస్సీ విద్యార్థిని ఇంద్రజకు ఫోన్ చేసి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నామని.. ప్రైజ్ మనీ వచ్చిందని, దాన్ని పంపేందుకు అవసరమైన డీడీ, రవాణా చార్జీలు చెల్లించాలని కోరాడు.

అయితే అది నమ్మి ఇంద్రజ కొంత మొత్తంలో నగదును అతడికి పంపింది. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కోల్‌కతాలో దాగున్న ప్రదీప్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు