వ్యక్తి ఆత్మహత్య

3 Jun, 2016 09:02 IST|Sakshi

షాద్‌నగర్ : చటాన్‌పల్లి గ్రామ శివారులోని బీవీరావు నగర్ పౌల్ట్రిలో బుధవారం ఓవ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... కేశంపేట మండల పరిధిలోని లింగంధాన గ్రామానికి చెందిన ఇస్తారి(55) గత 15ఏళ్లుగా లక్ష్మీనారాయణకు చెందిన పౌల్ట్రీలో కూలీ పనులు చేస్తున్నాడు. ఆరు నెలలుగా కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 

మరిన్ని వార్తలు