రైలు కింద పడి వ్యక్తి మృతి

14 Jul, 2016 09:56 IST|Sakshi

అరకు: విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ రైల్వే రిక్వెస్ట్ స్టేజి వద్ద గురువారం ఉదయం 7 గంటల సమయంలో రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అరకు మండలం కొండవీధి గ్రామానికి చెందిన కళాసి కొర్ర నానాజి(32)గా గుర్తించారు. రైలు కింద పడటంతో శరీరం నుజ్జునుజ్జైపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు