వడదెబ్బకు వృద్ధుడి మృతి

22 Mar, 2016 20:25 IST|Sakshi

సత్యవేడు : రోజురోజుకు మండుతున్న ఎండలు ప్రాణాలను హరిస్తున్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో వడదెబ్బ తగిలి ఓ వృద్ధుడు మృతి చెందాడు. వరదయ్యపాళెం మండలం వడ్డిపాళెంకు చెందిన కె.సుందరయ్య (72) రెండు రోజుల క్రితం పొలం నుంచి తిరిగి వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

మరిన్ని వార్తలు