రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

20 Jan, 2017 23:27 IST|Sakshi

నల్లచెరువు (కదిరి): నల్లచెరువు మండలం కొత్తపల్లి బస్టాప్‌ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  నరసింహులు (50) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. నరసింహులు కదిరి నుంచి ఆటోలో కొత్తపల్లి బస్టాప్‌ వద్దకు వచ్చాడు. అక్కడ రోడ్డు దాటుతుండగా మదనపల్లి వైపు నుంచి కదిరి వైపు వెళుతున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నరసింహులును 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సచేస్తుండగానే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాద్‌బాబు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు