ఇంటి పైకప్పు మరమ్మతు చేస్తుండగా..

15 Sep, 2017 22:17 IST|Sakshi

బత్తలపల్లి: ముష్టూరు గ్రామానికి చెందిన కుమ్మర కాటమయ్య (68) ఇంట్లోనే చిల్లరకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు రంధ్రం పడింది. కాటమయ్య శుక్రవారం మరమ్మతు చేయడానికి ఇంటిపైకెక్కాడు. విద్యుత్‌ ప్రసరిస్తున్న సర్వీస్‌వైరు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆయన్ని కిందకు తీసుకొచ్చి సపర్యలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందాడు. ఎస్‌ఐ హారున్‌బాషాకు సమాచారం అందించారు. మృతునికి భార్య అంజినమ్మ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు