ఉడుం'పట్టు'కు యత్నించి ఇరుక్కుపోయాడు!

17 Aug, 2015 09:33 IST|Sakshi
ఉడుం'పట్టు'కు యత్నించి ఇరుక్కుపోయాడు!

పట్టు పట్టడంలో ఉడుముతో పోటీపడి..  ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఓ యువకుడు. తనదారిన తాను వెళుతోన్న ఉడుమును పట్టుకునే ప్రయత్నం చేసి కొండగుహలో.. బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన అతగాడిని కాపాడటానికి ఏకంగా భారీ యంత్రాలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లా మద్నూరు మండలం పెద్ద శెక్కర్గకు హన్మాండ్లు(22) గొర్రెలకాపరి. ఆదివారం తన స్నేహితులతో కలిసి గొర్రెలు కాయడానికి వెళ్లిన హన్మాండ్లుకు ఓ ఉడుము కనపడింది. దాన్ని పట్టుకుందామనుకున్నాడు.. మొదటి ప్రయత్నంలోనే అది సర్రున జారిపోయి బండరాళ్ల మధ్యన దూరింది. హన్మాండ్లు కూడా వీరుడిలా బండరాళ్ల మధ్యకు ప్రవేశించాడు. ఉడుము మాత్రం నేల బొరియల్లోకి దూరిపోగా హన్మాండ్లు మాత్రం దిక్కుతోచని స్థితిలో అలా రాళ్ల మధ్యే ఇరుక్కుయాడు.

అతడ్ని బయటికి తీయడానికి స్నేహితులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పేందుకు వెళ్లారు. ఈలోపు అరకొర సిగ్నల్స్ అరకొరగా కొట్టుమిట్టాడుతున్న మొబైల్ ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి తన దుస్థితిని వివరించాడు హన్మాండ్లు. 

 

ఆ తర్వాత ఊరంతా ఒక్కటైంది. పలుగు, పారల సాయంతో హనుమాండ్లును బయటికి తీసే ప్రయత్నం చేశారు. కానీ విఫలమయ్యారు. ఇక చేసేదేమీలేక చివరికి ఓ జేసీబీ యంత్రాన్ని తెప్పించి ఆ ప్రాంతమంతా తొవ్వించారు. బండరాళ్లన్నింటినీ తొలిగించిన తర్వాతగానీ సురక్షితంగా బయటికి రాలేదు హన్మాండ్లు. ఆ తర్వాత భయంతో వణికిపోతూ అతడు.. నవ్వుతూ ఊరివాళ్లు ఇళ్లకేసి బయలుదేరారు..

        హన్మండ్లు పాక్కుంటూ లోపలికెళ్లిన ప్రాంతం


            హన్మండ్లు చద్ది.. దీన్ని చూసే గుర్తుపట్టారు..


      హన్మండ్లుతో మాట్లాడుతున్న గ్రామస్తులు


       జేసీబీతో రాళ్లను తీస్తున్న దృశ్యం


        బయటకు వచ్చిన హన్మండ్లు

>
మరిన్ని వార్తలు