బావమరిది చేతిలో బావ హతం

21 Jul, 2016 12:06 IST|Sakshi

కరీంనగర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో బావమరిది సొంత బావను హత్య చేశాడు. తన మాటకు ఎదురు చెప్పాడనే కోపంతో బావమరిది ఇత్తడి బకెట్‌తో దాడి చేయడంతో.. బావ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఎల్లంబజార్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోతారం గ్రామానికి చెందిన పిల్లి రమేష్ (33) మామ గారింట్లో జరుగుతున్న ఘర్షణను నివారించేందుకు ఎల్లంబజార్‌కు వచ్చాడు.

ఈ క్రమంలో బావమరిది తీరు నచ్చలేదని చెప్పడంతో.. కోపోద్రిక్తుడైన బావమరిది వినోద్... ఇత్తడి బకెట్‌తో బావపై దాడి చేశాడు. దీంతో రమేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ