నవరత్నాల బతుకమ్మ

30 Sep, 2016 21:47 IST|Sakshi
నవరత్నాల బతుకమ్మ

సాక్షి, సిటీబ్యూరో: అరుదైన సూక్ష్మ కళారూపాల తయారీలో ఇప్పటికే 26 ప్రపంచ రికార్డులు, నాలుగు జాతీయ రికార్డులు సాధించిన హస్తినాపూర్‌కు చెందిన ముంజంపల్లి విద్యాధరాచారి తాజాగా మరో అద్భుత కళారూపాన్ని సృష్టించాడు. బతుకమ్మ నవరాత్రులను పురస్కరించుకొని 166 నవరత్నాలు (కెంపులు, ముత్యాలు, పగడాలు, పచ్చలు, పుష్యరాగములు, వజ్రాలు, నీలములు, గోమేధికాలు, వైఢూర్యాలు) ఒదిగిన అతి చిన్న బంగారు బతుకమ్మ తయారు చేశారు. నవ రత్నాలతో బతుకమ్మ తయారు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి చిన్న బతుకమ్మ ఇది.  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవితకు ఈ బతుకమ్మ అంకితం ఇస్తున్నట్లు విద్యాధరాచారి చెప్పారు.  


 

మరిన్ని వార్తలు