కోనసీమలో మాంగల్యం తంతునానేనా

14 Mar, 2017 22:30 IST|Sakshi
కోనసీమలో మాంగల్యం తంతునానేనా
 
అమలాపురం టౌ¯ŒS:
కోనసీమకు చెందిన వర్ధమాన సినీ హీరో చేత¯ŒS శ్రీను ఈ సీమ పచ్చని పల్లెల్లోనే ప్రేమలో పడి పెళ్లి కొడుకయ్యాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. ఇదంతా నిజ జీవితంలో కాదండోయ్‌... ‘మాంగల్యం తంతు నానేనా’ చిత్రం షూటింగ్‌లో భాగంగా. మానసి మూవీస్‌ పతాకంపై దర్శకుడు మల్లిబాబు తెరకెక్కిస్తున్న ‘మాంగల్యం తంతునానేనా’ చిత్రంలో హీరో చేత¯ŒS శ్రీను లవర్‌ బోయ్‌గా నటిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన హీరో కోనసీమలో పల్లెటూరిలో ఉన్న అమ్మాయికి మధ్య జరిగే ప్రేమాయణమే ఈ చిత్రకథ. కోనసీమలోని అంతర్వేది, అల్లవరం మండలం గూడాల, రాజోలు మండలం సోంపల్లి తదితర గ్రామాల్లోని ఈ సినిమా చిత్రీకరణ జరిగిం.?   ఇక్కడి వరి చేలు, గోదావరి గట్లు, ఏటి గట్లపై హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలతో ఓ పాట కూడా చిత్రీకించారు. గూడాలలో వారిద్దరి పెళ్లి చూపులు, పెళ్లి తతంగం దృశ్యాలను తెరకెక్కించారు. 
వినూత్నంగా ‘పెళి్లకి ముందు ప్రేమ కథ’ పాటల విడుదల
తాను హీరోగా నటించిన,  చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘పెళి్లకి ముందు ప్రేమ కథ’ చిత్రం పాటలను తమ నిర్మాత, దర్శకుడు వినూత్నంగా విడుదల చేయాలనే ప్రయత్నంలో ఉన్నారని హీరో చేత¯ŒS శ్రీను తెలిపారు. అమలాపురంలోని ప్రసిద్ధ ఇంజనీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ మేడిది రమేష్‌బాబు స్వగృహంతో చేత¯ŒS శ్రీను మంగళవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. నిజజీవితంలో హీరో హీరోయిన్ల జంటలతో ఈ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. నాగార్జున, అమల, శ్రీకాంత్, ఊహ, రాజశేఖర్, జీవిత, వరుణ్‌ సందేశ్, హృత్రిక, నందూ, గీతామాధురి దంపతుల చేతుల మీదుగా చిత్రంలో ఐదు పాటలను విడుదల చేయనున్నారని చెప్పారు.  ఏప్రిల్‌ 7న విడుదల కానున్న ఈ చిత్రంలో హీరోయి¯ŒSగా సునయన నటించిదన్నారు. మరో రెండు కొత్త చిత్రాల్లో తాను నటిస్తున్నానని, వాటికి ఇంకా పేర్లు పెట్టలేదని చేత¯ŒS శ్రీను తెలిపారు. అంతకు ముందు మేడిది నాగేంద్ర ఆధ్వర్యంలో యువకులు హీరో చేత¯ŒS శ్రీనుకు స్వాగతం పలికారు. సినీ నటుడు గనిశెట్టి రమణలాల్‌ కూడా పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు