మన్యంలో మావోయిస్టుల హల్‌చల్‌

2 Dec, 2016 23:04 IST|Sakshi
మన్యంలో మావోయిస్టుల హల్‌చల్‌
  • పోలీసులు లక్ష్యంగా మందుపాతర్లు
  • జాతీయ రహదారిపై కలకలం
  • సరివెల(చింతూరు): 
    పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేష¯ŒS గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు తొలిరోజే మన్యంలో హల్‌చల్‌ చేశారు. చింతూరు మండలం సరివెల వద్ద గురువారం అర్థరాత్రి జాతీయ రహదారిపై పోలీసులు లక్ష్యంగా మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాల అడుగున నాలుగు మందుపాతర్లను అమర్చారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వాటిని నిర్వీర్యం చేయడంతో ప్రమాదం తప్పింది. ఈనెల 2 నుండి 8 వరకు  పీఎల్‌జీఏ వారోత్సవాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరివెల వద్ద జాతీయ రహదారిపై మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలను వుంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ రహదారి గుండా వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా దారి మళ్లించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యానర్లు, కరపత్రాల కింద మావోయిస్టులు మందుపాతర్లు అమర్చి వుంటారని అనుమానించి బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ సాయంతో తనిఖీ చేశారు. ఊహించినట్టే వాటికింద మావోయిస్టులు అమర్చిన మూడు టిఫి¯ŒS బాక్స్‌ బాంబులతో పాటు వెదురుతో తయారు చేసిన ఐఈడీని పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. సంఘటనా స్థలాన్ని ఓఎస్డీ డాక్టర్‌ ఫకీరప్ప, సీఐ దుర్గాప్రసాద్‌ పరిశీలించారు.
     
    మావోయిస్టుల కొత్త పంథా
    తాజా ఘటనా ద్వారా మావోయిస్టులు మన్యంలో కొత్త పంథాకు తెరలేపారు. గతంలో వారోత్సవాలు, బంద్‌లు నిర్వహించే సమయంలో మావోయిస్టులు కేవలం కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు వేయడం పరిపాటి. కాగా తాజాగా వాటికింద మందుపాతర్లను అమర్చడం పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఛత్తీస్‌గఢ్‌లో ఎ¯ŒSకౌంటర్లు జరిగిన సమయంలో పోలీసులు మృతిచెందితే వారి మృతదేహాల కింద మావోయిస్టులు మందుపాతర్లను అమర్చేవారు. మృతదేహాలను తొలగించేందుకు వచ్చిన పోలీసులు వాటి బారిన పడి మృత్యువాత పడేవారు. వారోత్సవాలకు పిలుపునిచ్చిన మావోయిస్టులు    ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ లో పలుచోట్ల కరపత్రాలు, మందుపాతర్లను మావోయిస్టులు అమర్చారు. ఈ క్రమంలో ఆంధ్రా సరిహద్దుల్లోని తెలంగాణ రాష్ట్రం వెంకటాపురం వద్ద మావోయిస్టులు వుంచిన కరపత్రాలను తీసేందుకు ఓ ఆటోడ్రైవర్‌ ప్రయత్నించగా అది పేలడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి.
    ప్రతీకారేఛ్ఛలో మావోయిస్టులు: ఇటీవల ఏవోబీలో జరిగిన భారీ ఎ¯ŒSకౌంటర్‌ ద్వారా 32 మందిని కోల్పోయిన మావోయిస్టులు వారోత్సవాల సందర్భంగా ప్రతీకార దాడులకు పాల్పడవచ్చని ఇప్పటికే నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ నేపధ్యంలో తొలిరోజే ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణ , చత్తీస్‌గఢ్‌లో మందుపాతర్లు అమర్చడం ద్వారా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకున్నారు. వారోత్సవాల వేళ నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా పీఎల్‌జీఏ 16వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని, బూటకపు ఎ¯ŒSకౌంటర్లను వ్యతిరేకించాలని, 3వ గ్రీ¯ŒSహంట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని సం«ఘటనా స్థలంలో శబరి ఏరియా కమిటీ పేరుతో వుంచిన కరపత్రాల్లో మావోయిస్టులు పేర్కొన్నారు. 
     
    కూంబింగ్‌ను ముమ్మరం చేశాం
    మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా సరిహద్దుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశాం. జాతీయ రహదారిపై బ్యానర్లు, పోస్టర్లు వుంచిన విషయం తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేసి వాహనాల దారిని మళ్లించి వాటిని అక్కడినుండి తొలగించాం. వాటికింద అమర్చిన మందుపాతర్లను నిర్వీర్యం చేశాం. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. 
    డాక్టర్‌ కె.ఫకీరప్ప, చింతూరు ఓఎస్డీ
     
మరిన్ని వార్తలు