జంపన్న సహచరిణి సుల్తానాబాద్‌ హేమలతే!

26 Dec, 2017 13:06 IST|Sakshi

 స్వర్ణక్క పేరుతో కొనసాగుతూ హతం

 జిల్లాతో అనుబంధం

పెద్దపల్లి:  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సీనియర్‌ నేత జంపన్నకు ఉమ్మడి జిల్లాలోని పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీ కార్యకలాపాలతో విడదీయరాని అనుబంధం ఉంది. 1994లో సుల్తానాబాద్‌కు చెందిన హేమలత అనే ప్రైవేటు పాఠశాల టీచర్‌ పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరారు. ఆ సమయంలో జంపన్న మహదేవపూర్, ఏటూరు నాగారం ప్రాంతాలకు జిల్లా కమిటీ సభ్యునిగా ఉన్నారు. ఆ సమయంలో పెద్దపల్లి, మంథని దళాలకు శిక్షణ ఇచ్చేందుకు జంపన్న ఈ ప్రాంతంలో పర్యటించేవారు. జంపన్నకు సహచరిణిగా పని చేసిన హేమలత ఆయననే పార్టీ వివాహం చేసుకొని భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి ప్రాంత దళ కమాండర్‌గా పని చేశారు. 2001లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో స్వర్ణక్కతోపాటు 8 మంది హతమయ్యారు. సహచరిణి కోల్పోయిన జంపన్న ఆ తర్వాత పార్టీలో రెండో వివాహం చేసుకున్నారు. ఆమెతో కలిసి ప్రస్తుతం ప్రభుత్వానికి జంపన్న లొంగిపోయారు. 

మరిన్ని వార్తలు