దొరికిన మరాఠీ దొంగలు

25 Aug, 2016 00:13 IST|Sakshi
దొరికిన మరాఠీ దొంగలు
నంద్యాల: మహానంది క్షేత్రంలోని కోనేరులో ఇటీవల  ఓ భక్తుడు స్నానం చేస్తుండగా అతని బ్యాగ్‌లోని విదేశీ కరెన్సీని చోరీ చేసిన ముగ్గురు మహారాష్ట్రకు చెందిన దొంగలను పోలుసులు  పట్టుకున్నారు. వారి నుంచి విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.  రూరల్‌ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  సికింద్రాబాద్‌కు చెందిన మేకల రామాంజనేయులు 15వ తేదీన మహానంది క్షేత్రానికి కుటుంబ సభ్యులతో సహా విచ్చేశారు. ఆయన  ఆలయం వెలుపల ఉన్న కోనేరు వద్ద స్నానం చేయడానికి వెళ్తూ, సమీపంలోని చెట్టు వద్ద బ్యాగ్‌ పెట్టాడు. స్నానం చేసి వచ్చాక బ్యాగ్‌ కనిపించలేదు. ఇందులో రూ.99వేలు అమెరికా డాలర్లు, సౌదీకి చెందిన రియాజ్‌ నోట్లు ఉన్నాయి. దీంతో ఆయన మహానంది ఎస్‌ఐ కష్ణుడుకు ఫిర్యాదు చేశారు. అయితే ముగ్గురు మరాఠీ దొంగలు బ్యాగ్‌లో నుంచి నోట్లను కాజేస్తుండగా ఆ దశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ సీసీ కెమెరా పుటేజ్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు విదేశీ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులు, వ్యాపారస్తుల దగ్గర ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని సోలార్‌పూర్‌కు చెందిన విశాల్‌ మానిక్‌ చౌహాన్, ధాన్‌సింగ్‌ బాపు చౌహాన్, చెన్నాసింగ్‌భగవత్‌లను అరెస్ట్‌ చేసి రూ. 99,344లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో మహానంది ఎస్‌ఐ కష్ణుడు, రూరల్‌ ఏఎస్‌ఐ మహబూబ్‌పీరా పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు