మార్చి 7న జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన

29 Dec, 2016 23:35 IST|Sakshi
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
విశ్రాంత బ్యాంక్‌ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 2017 మార్చి 7న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద లక్ష మంది విశ్రాంత ఉద్యోగులతో ఆందోళన చేయనున్నట్టు అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సమాఖ్య చైర్మ¯ŒS ఎవీవీ సత్యనారాయణ అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమాఖ్య ఆధ్వర్యంలో కుమారి థియేటర్‌ రోడ్డులో ఉన్న సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద గురువారం నిరసన చేపట్టారు. నూరు శాతం డీఏ సౌకర్యాన్ని 2002 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వారికి కూడా వర్తింపచేయాలని, కుటుంబ పింఛను విధానాన్ని ఇతర శాఖల మాదిరిగా మెరుగుపరచాలని, దేశంలో వేతన సవరణ జరిగినప్పుడు అన్ని శాఖల విశ్రాంత ఉద్యోగులకు అమలు చేస్తున్నట్టుగా పింఛ¯ŒS కూడా అమలు చేయాలని, పింఛ¯ŒS కోసం దరఖాస్తు చేసుకోలేని వారికి అవకాశం కల్పించాలని సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతోనే ఢిల్లీలో ఆందోళన చేపడతామని, తరువాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరణ్‌జైట్లీని కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. కార్యదర్శి కేఏపీ శర్మ, ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, వీకేవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు