సంత.. నోట్ల చింత

17 Nov, 2016 04:48 IST|Sakshi
సంత.. నోట్ల చింత

దేవరకద్ర మార్కెట్‌లో తగ్గిన వ్యాపారాలు
చిల్లర ఉంటేనే సరుకులంటున్న వ్యాపారులు

 దేవరకద్ర : దేవరకద్రలో బుధవారం జరిగిన సంతలో నోట్ల చింతతో వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగారుు. వారాంతపు సంత కావడం వల్ల చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు వారానికి సరిపడా కొనుగోలు చేస్తుంటారు. అరుుతే రూ.వేరుు, రూ. 500 నోట్లు చెల్లవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పాత నోట్లను వ్యాపారుల తీసుకోక పోవడంతో ఇబ్బందుల పాలయ్యారు. బ్యాంకుల వద్ద గంటల తరబడి నిలబడి కొత్త నోట్లను తీసుకున్న ఫలితం లేకుండాపోరుుంది. ఎక్కడికి వెళ్లిన రూ. 2వేల నోటుకు చిల్లర లేదని చెప్పడంతో ఏమి కొనలేని పరిస్థితిని ప్రజలు ఎదుర్కొన్నారు.

 సగానికి తగ్గిన వ్యాపారాలు
నిత్యావసర సరుకుల దుకాణాలలో సగానికి సగం వ్యాపారాలు తగ్గిపోయారుు. కూరగాయల వ్యాపారం  మందకొడిగా సాగింది. గతంలో సంతరోజు ఒక్కో దుకాణం రూ.5వేల వ్యా పారం నడవగా.. ప్రస్తుతం రూ.2వేలకు కూడా మించడం లేదు. ఇక కిరాణా షాపుల్లో సరుకులు కొనే వారు తక్కువగా వచ్చారు. చాలామంది బ్యాంకుల వద్దనే పడిగాపులు పడడం వల్ల సంత అంతా ఖాళీగా కనిపిం చింది. ఎక్కడ చూసిన పాత నోట్లు చెల్లవని చెప్పడంతో డబ్బులు ఉన్నా ఏమి తినలేము, ఏమి కొనలేమని పలువురు నిరాశకు గురయ్యారు. చాలాచోట్ల ఏమైనా సరుకులు అడిగితే ముందుగా చిల్లర ఉందా అని అడుగుతున్నారు. లేదని వినియోగదారులు చెప్పడంతో సరుకులుకూడా లేవని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు