పెళ్లంటే ఇరవై పేజీల శుభలేఖంటా...

21 Aug, 2016 23:51 IST|Sakshi
శుభలేఖలో వివరించిన అంశాలు

అశ్వారావుపేట: పెళ్లి శుభలేఖను సాధ్యమైనంత తక్కువ పేజీలు... కుదిరితే చిన్న కార్డుపై ముద్రిస్తున్నారు. కానీ జిల్లాలోని అశ్వారావుపేటకు చెందిన జల్లిపల్లి శ్రీరామమూర్తి కుమారుడు మణికంఠ వివాహ శుభలేఖను 20 పేజీలతో ముద్రించాడు. వివాహంలో రకాలు, వివాహంలో పఠించే వినాయక ప్రార్థన, శివానందలహరి తాత్పర్యాలను, కల్యాణ సమయంలో వేదపండితులు పఠించే సంస్కృత స్లోకాల సారాంశాలను వివరించారు. వివాహంలో ప్రతి ఘట్టాన్ని సంపూర్ణంగా వివరిస్తూ శుభలేఖలో పొందుపర్చారు. ఈ శుభలేఖ అందిన ప్రతి కుటుంబంలో ఒక ప్రత్యేక వస్తువుగా భావిస్తూ భద్రపరుచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు