నిప్పంటించుకుని... మహిళ పరుగులు

23 Jun, 2016 13:10 IST|Sakshi

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ..మంటలకు తాళలేక పరుగులు తీసింది. శంషాబాద్ మండలం కాపుగడ్డలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో కాపుగడ్డ బస్తీకి చెందిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు వ్యాపించటంతో తాళలేక బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. గమనించిన చుట్టుక్కల వారు మంటలను ఆర్పి వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు