అనుమానంతోనే భార్య హత్య

13 Sep, 2016 21:50 IST|Sakshi
అనుమానంతోనే భార్య హత్య
హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌
 కానిస్టేబుల్, మరో మహిళపై విచారణ 
 తిరువూరు సీఐ వెల్లడి 
మేడూరు (గంపలగూడెం): 
భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు  మేడూరులో ఈనెల 7వ తేదీ రాత్రి జరిగిన ఒక మహిళ హత్యకేసులో నిందితుడు భర్త నల్లగట్ల ప్రకాశరావు చెప్పాడు. గ్రామానికి చెందిన నల్లగట్ల నిర్మల (32)ను భర్త వెదురు బొంగుకర్రతో కొట్టిచంపినట్లు కేసు నమోదైంది. ఈ కేసులోమృతురాలి అన్న ఎక్కిరాల మోహన్‌రావు ఫిర్యాదు మేర కేసు నమోదు చేశారు. కాగా నిందితుడైన నిర్మల భర్త ప్రకాశరావును మంగళవారం గ్రామం సమీపంలోని ఎన్నెస్పీ కాల్వ సమీపంలో అరెస్ట్‌ చేసినట్లు సీఐ కిషోర్‌బాబు తెలిపారు. తన భార్య వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకొందన్న కారణంగానే క్షణికావేశంలో కర్రతో కొట్టగా చనిపోయిందని విచారణలో తెలిపినట్లు సీఐ వివరించారు. నిందితుడిని తిరువూరు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. కేసులో మరో ఇద్దరు నిందితులైన కానిస్టేబుల్‌ నల్లగట్ల  సురేష్, మరో మహిళ చిలకమ్మలపై విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎస్సై శివరామకృష్ణ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు