శ్రీమఠంలో సామూహిక సత్యనారాయణ పూజలు

10 Jun, 2017 00:18 IST|Sakshi
మంత్రాలయం : ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో సామూహిక సత్యనారాయణస్వామి పూజలు గావించారు. శ్రీమఠంలోని గురుసార్వభౌమ కళాప్రదర్శన ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సత్యనారాయణస్వామి చిత్రపటాన్ని కొలువు చేశారు. అర్చకుడు కురిడి నాగేష్‌ అభిషేకాలు, అర్చనలు, హారతులు పట్టి పూజలు కానిచ్చారు. భక్తులు వందలాదిగా పాల్గొని స్వామి పూజలో తరించారు.  పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు జయ, దిగ్విజయ, మూలరాముల పూజలు ఆకట్టుకున్నాయి. మఠం మేనేజర్‌ శ్రీనివాసరావు, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు. 
 
మరిన్ని వార్తలు