క్షణాల్లో బూడిదైంది

14 Feb, 2017 01:52 IST|Sakshi
= గుజిరీలో భారీ అగ్నిప్రమాదం  
= రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం  
అనంతపురం సెంట్రల్‌ : నగరంలోని నేషనల్‌పార్కు సమీపంలోని సుఖదేవ్‌నగర్‌లో ఉన్న గుజిరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో నివాసం ఉంటున్న ఖాదర్‌బాషా, ఆయన కుమారుడు నూర్‌బాబా గుజిరీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. నేషనల్‌ పార్కు సమీపంలో జాతీయరహదారి పక్కన గుజిరీ నిర్వహిస్తున్నారు. వాడి పడేసిన వాటర్‌ బాటిâýæ్లను ఎగుమతి చేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. సోమవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు గుజిరీకి నిప్పంటుకుంది.

నిర్వాహకులు గమనించి వెంటనే ఫైరింజి¯ŒSకు సమాచారమందించారు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ కావడం, ఆరుబయట గుజిరీ ఉండడంతో అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చేలోపు గాలి వ్యాపించి నిమిషాల్లో మంటలు గుజిరీ అంతా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో    అగ్రిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడానికి వీలులేకుండా పోయింది. మంటల్లో దాదాపు 80 శాతం గుజిరీ కాలిపోయింది. రెండు ఫైరింజిన్లు వచ్చి మంటలు అదుపు చేసినా ఫలితం లేకపోయింది. గుజిరీ మొత్తం కాలిబూడిద కావడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

బాధితుడు నూర్‌బాబా మాట్లాడుతూ దాదాపు రూ.20 లక్షలకు పైగానే ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయాడు. షార్టుసర్క్యూట్‌ వల్ల జరిగిందా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్నది తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరాడు. స్టేష¯ŒS ఫైర్‌ ఆఫీసర్‌ కేపీ లింగమయ్య నష్టం అంచనా వేశారు.    దాదాపు రూ.10 లక్షలకు పైగానే ఆస్తి నష్టం వాటిల్లి ఉండొచ్చని భావించారు.   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!