డాక్టర్ల నిర్లక్ష్యంపై కన్నెర్ర

17 Dec, 2016 23:40 IST|Sakshi
డాక్టర్ల నిర్లక్ష్యంపై కన్నెర్ర
= చికిత్స పొందుతూ బాలింత మృతి 
= ఆస్పత్రి ఎదుట బంధువుల 
ఆందోâýæన, ఉద్రిక్తత     
= చూసేందుకు వస్తూ 
రోడ్డు ప్రమాదంలో బంధువు మృతి 
= తల్లిదండ్రులకు గాయాలు  
= రంగంలోకి దిగిన పోలీసులు 
హిందూపురం అర్బన్: హిందూపురంలోని తేజ నర్సింగ్‌ హోం ఎదుట లేపాక్షి మండలం ఉప్పరపల్లి వాసులు శనివారం ఆందోâýæనకు దిగారు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ధర్నా చేశారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.  
అసలేం జరిగిందంటే...  
ఉçప్పరపల్లికి చెందిన మంజుల(19)ను ప్రసవం కోసం నవంబరు 19న హిందూపురంలోని తేజ నర్సింగ్‌ హోంకు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి ఆమెకు సిజేరియ¯ŒS ఆపరేష¯ŒS చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. అదే రాత్రి ఇంటికెళ్లిన కాసేపటికే ఒళ్లంతా నొప్పులు, కడుపు ఉబ్బరమంటూ తిరిగి ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చారు.

ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స మొదలుపెట్టిన వైద్యులు 28 రోజులుగా చికిత్స అందిస్తూ వచ్చారు. శనివారం సాయంత్రం ఆమె మృతి చెందింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపకుండా ఆస్పత్రికిసం బంధించిన అంబులెన్సును రప్పించి మృతదేహాన్ని అందులో ఉంచారు. ఇంతలో భర్త, బంధువులు వచ్చి ‘మాకేం చెప్పకుండా ఎందుకు పంపించేస్తున్నారంటూ’ ప్రశ్నించారు. అసలు విషయం చెప్పడంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. వైద్యుల తీరును తప్పుబట్టారు.  వాస్తవాలు చెప్పకుండా ఇప్పుడు మృతదేహాన్ని అప్పగిస్తారా అంటూ నిలదీశారు. న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆస్పత్రి ఎదుటే బైఠాయించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  
 
రంగంలోకి దిగిన పోలీసులు 
విషయం తెలుసుకున్న వ¯ŒSటౌ¯ŒS సీఐ ఈదురుబాషా, ఎస్‌ఐ వెంకటేశ్‌ తమ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోâýæనకారులతో చర్చించారు.  చివరకు నష్ట పరిహారం ఇచ్చేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో వారు ఆందోâýæన విరమించారు.  
 
చూసేందుకు వస్తూ.. 
రోడ్డు ప్రమాదానికి గురై... 
ఆస్పత్రిలో తమ బిడ్డ మంజుల మృతి చెందినట్లు తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు అక్కమ్మ, చిన్ననరసప్ప సహా సమీప బంధువులు కర్ణాటకలోని శిడ్లఘట్ట సమీపంలో గల గొరిమినుపల్లినుంచి  హుటాహుటిన కారులో హిందూపురం బయలుదేరారు.  మార్గమధ్యంలోని ఆంధ్ర సరిహద్దులోని  గడిదం గ్రామం వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న(మంజులకు వరుసకు అత్తయ్యే) బంధువు మృతి చెందారు.  ఆమె తల్లిదండ్రులకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను కర్ణాటకలోని గౌరిబిదనూరు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించినట్లు బంధువులు తెలిపారు. 
మరిన్ని వార్తలు