గణితంపై పట్టు సాధించాలి

22 Aug, 2016 01:30 IST|Sakshi
  • గణిత ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్రస్వామి
  • ఖిలావరంగల్‌ : గణితంపై విద్యార్థులు భయాన్ని వీడి పట్టు సాధించాలని గణిత ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నరేంద్రస్వామి, శ్రీనివాసస్వామి సూచించారు. ఆదివా రం వరంగల్‌ స్టేషన్‌రోడ్డులోని కృష్ణాకాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు బండారి రమేష్‌ ఆధ్వర్యంలో గణిత బోధనోపకరణాల తయారీపై ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ తరగతి జరిగింది. ముఖ్య అతిథులుగా నరేంద్రస్వామి, శ్రీనివాసస్వామి హాజరై మాట్లాడారు. గణితశాస్త్రానికి సంబంధించి బోధనోపకరణాల తయారీపై ఉపాధ్యాయులు అవగాహన పెంచుకుని విద్యార్థులకు సులభరీతిలో బోధించాలన్నారు. ప్రతి గణిత ఉపాధ్యాయుడు బోధనోపకరణాలు వినియోగించి పాఠాలు బోధించాలన్నారు. అనంతరం ఫోరం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా బండారి రమేష్, కార్యదర్శిగా రామయ్య, గౌరవాధ్యక్షుడిగా కె.వి.శ్యాంసుందరాచార్యులు, కోశాధికారిగా కె.శైలేంద్రకుమార్, కార్యవర్గ సభ్యులుగా గంప అశోక్‌కుమార్, శ్రీనివాస్, రంగాచారి, సహాయ కార్యదర్శిగా సీతాలక్ష్మి ఎన్నికయ్యారు. అనంతరం వారు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ పాఠశాలల గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు