జయశంకర్‌ ఆశయ సాధనకు కృషి

7 Aug, 2016 00:10 IST|Sakshi
జయశంకర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం కడియం, ఎంపీ, ఎమ్మెల్యేలు
  • ఉద్యోగాల భర్తీ, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం
  • నాణ్యమైన విద్య కోసం 350 గురుకులాలు  
  • జయశంకర్‌ జయంతి వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
  • హన్మకొండ : జయశంకర్‌ ఆలోచనలు, ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పనిచేస్తున్నారని ఉప ము ఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో శనివారం జయశంకర్‌ జయంతి వే డుకలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, ఎంపీలు పసునూరి దయాకర్, అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, మేయర్‌ నన్నపునేని నరేందర్, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ తదితరులు ఏకశిల పార్కులోని జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు.
     
    అనంతరం కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అడ్డుకుంటున్నారని తూర్పారబట్టారు. 25 వేల కాంట్రాక్ట్‌ ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. త్వరలో 10వేల టీచర్‌ పోస్టులు, గురుకులాల్లో 4 వేల ఉపాధ్యాయ పోస్టులు, 4వేల పారా మెడికల్, మెడికల్‌ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్‌ పీఎస్‌సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని, దీంతో జరిగే నష్టమేమిటని ప్రశ్నిం చారు. కేజీ టు పీజీ నాణ్యమైన విద్యను అం దించేందుకు రాష్ట్రంలో 350 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశామని, ఈ విద్యాలయా ల ద్వారా 1.75 లక్షల మందికి విద్య అందించనున్నట్లు చెప్పారు.
     
    తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేసిన ప్రొఫెసర్‌ కోదండరాం వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ వ్యతిరేకులకు బలం చేకూరుస్తోందన్నారు. 
    2013 చట్టం, 123 జీఓలో ప్రాజెక్టు నిర్వాసితులు ఏది కోరుకుంటే ఆ ప్రకారం పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గుడిమల్ల రవికుమార్, జన్ను జకార్యా, నÄæూముద్దీన్, మర్రి యాదవరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, జయశంకర్‌ దత్తపుత్రుడు బ్రహ్మం, కుటుంబ సభ్యు లు, డిప్యూటీ మేయర్‌ సిరాజొద్దీన్, కార్పొరేట ర్లు నల్ల స్వరూపారాణి, మిడిదొడ్డి స్వప్న, వీరగంటి రవీందర్, జోరిక రమేష్‌ పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు